విశ్వహిందూ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు
పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 17 ( జనం సాక్షి):మార్గశిర శుద్ద ఏకాదశి డిసెంబర్ 3న గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు నెట్టం రాధాకృష్ణ గీతా ధర్మప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత కంఠస్థ పోటీల కరపత్రాలను మణుగూరు మండలం గుట్టమల్లారంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని, దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించే విధంగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం గీతా జయంతి రోజున భగవద్గీత లోని కొన్ని శ్లోకాలను కంఠస్థం చేయటం వల్ల సమాజంలో ఎలా ఉండాలో నేర్పుతుంది విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరగడమే కాక స్వచ్ఛమైన ఉచ్చరణ భగవద్గీత పఠనానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈ పోటీలను నాలుగు విభాగాలుగా విభజించారు మొదటిది శిశు వర్గ ఇందులో ఒకటి రెండవ తరగతుల వారు ఒకటవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకు రెండవది ప్రాథమిక వర్గ 3,4వ తరగతి వారు ఒకటో శ్లోకం నుంచి 10 వ శ్లోకం వరకు మూడవది మాధ్యమిక వర్గ ఇందులో 5 6 7 తరగతుల వారు ఒకటవ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు నాల్గవది ఉన్నత వర్గ ఇందులో ఎనిమిది తొమ్మిది పద తరగతుల వారు
ఒకటవ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు కంఠస్థం చేయాలి. వివిధ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చును ప్రవేశ రుసుము రూ 10 జిల్లాస్థాయి పోటీలను డిసెంబర్ రెండో వారంలో వివేకానంద పాఠశాల కొత్తగూడెం నందు నిర్వహించబడును ఆసక్తిగల విద్యార్థులు పాల్గొన వచ్చును.Kh అందరూ చదివి తమ యొక్క జీవితాన్ని మార్చుకుని అందరూ ఆనందంగా వుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మణుగూరు ప్రఖండ అధ్యక్షుడు నెట్టెం. రాధాకృష్ణ, గీతాధర్మప్రచారసేవాసమితి ఉపాధ్యక్షుడు యడారి. రాంమూర్తి, కార్యదర్శి పురిటి. విజయలక్ష్మి, సహకార్యదర్శులు కే.సునిత, కే.అన్నపూర్ణ దేవి, బి.సరస్వతి, ఏ.స్వరూప,ఎన్.అరుణ, టి.ఆదిలక్ష్మి, స్వాతి ఆలయ అర్చకులు బి.రాజు తదితరులు పాల్గొన్నారు.