విషతుల్య పరిశ్రమలతో అభివృద్ధి చేస్తామనడం అవివేకం

మంత్రి ధర్మానపై విరుచుకుపడిన పర్యావరణ పరిరక్షణ సంఘం
శ్రీకాకుళం, జూలై 8 :
విషతుల్య పరిశ్రమలతో జిల్లాను అభివృద్ధి చేస్తానని పేర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద వరావు జిల్లా ప్రజలను అమాయకులుగా చి త్రీకరించడం ఆయన అవివేకానికి నిదర్శ నమని పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రతి నిధులు విరుచుకుపడ్డారు. సోంపేట థర్మల్‌ వ్యతిరేక నిరాహార దీక్ష శిబిరం వద్ద వై. కృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీరావు, ఎస్‌. శ్రీరాంమూర్తి, చంద్రయ్య, ఎం. రాఘవులు తదితరులు మాట్లాడారు. లండన్‌ లో 2006 మంది శాస్త్రవేత్తలు సమావేశమై థర్మల్‌, అణువిద్యుత్‌ కేంద్రాలతో భూ మండ లానికి పెను ముప్పు పొంచి వుందని, వివిధ దేశాధినేతలకు హెచ్చరికలు జారీ చేసిన అంశాన్ని మంత్రి తెలుసుకోకపోవడం దారుణ మన్నారు. పర్యావరణాన్ని ప్రజా జీవితాలను నాశనం చేసే థర్మల్‌ మంత్రం జపించండం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.