విహారయాత్రలో కాలేజీ బస్సు బోల్తా…

3

తల్లాడ(ఖమ్మం) : విజ్ఞాన, విహార యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ జెన్నింగ్ మిల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. అనంతపురంలోని బాలాజీ ఫార్మసీ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థుల బృందం కళాశాల బస్సులో విజ్ఞాన , విహార యాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో సెమినార్లలో పాల్గొన్న అనంతరం భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తిరగి ఇంటికి వెళ్తుండగా.. బస్సు తల్లాడ జెన్నింగ్ మిల్ వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.