విూరాబాయ్ చానుకు అండగా మోదీ
మణిపూర్ సిఎం బీరేన్ వెల్లడి
న్యూఢల్లీి,ఆగస్ట్7(జనంసాక్షి): రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన వెయిట్‌లిప్టర్ విూరాబాయ్ చానుకు, మరో అథ్లెట్‌కు ప్రధాని మోదీ సాయం చేశారని.. ఆ సాయం వల్లనే చాను ఆరోగ్యసమస్యల నుంచి బయటపడి పతకం సాధించిందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. చాను ఒకప్పుడు వెన్నునొప్పితో బాధపడుతుంటే ఆ సమాచారం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరిందని, అప్పుడు ప్రధాని నేరుగా జోక్యం చేసుకుని.. ఆమె చికిత్సకు, విదేశాల్లో శిక్షణకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించారని వెల్లడిరచారు. ’పేరు చెప్పనుగానీ.. అమెరికాలో వైద్యం చేయించుకుని, శిక్షణ పొంద డానికి మరో అథ్లెట్‌కూ ప్రధాని సాయం చేశారని ఆయన చెప్పారు. ఈ సాయాం వృధాగా పోలేదని అన్నారు. చానూ సత్తా చాటి
భారత్ గౌరవాన్ని రెపరెపలాండిరదిందన్నారు.