వీఆర్ఏలకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలి.

కోడేరు (జనం సాక్షి) 26 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం కేంద్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ప్రకటించిన పేస్కేలు హామీని నెరవేర్చాలని వీఆర్ఏలు కోరారు. 25-7-2022 సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన వీఆర్ఏలకు పెన్షన్ల సౌకర్యం కల్పించాలని. అర్హులైన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విఆర్ఎ లు డిమాండ్ చేశారు.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ ను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వం దిగివచ్చే వరకు సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని వీఆర్ఏల జేఏసీ వారు తెలిపారు.1) ముఖ్యమంత్రి 9- 9- 2020 రోజు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పిన విధంగా పే స్కేల్ వెంటనే ఇవ్వాలి.2) 55 ఏళ్లు నిండిన వీఆర్ఏల అర్హత కలిగిన పిల్లలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి.
3) అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి.
ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ మండల అధ్యక్షులు ఎండి జిలాని, శివకృష్ణ,వేముల మల్లేష్, బిచ్చయ్య, నీలమ్మ, బాలకిష్ణయ్య, నాగేంద్రం అలివేల, తదితరులు పాల్గొన్నారు.