*వీఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి నాయకులు*

కొడకండ్ల, జులై27(జనం సాక్షి):
భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల శాఖ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో వీఆర్ఏల నిరవేదిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ నాయకులు  వారికి పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న  రాష్ట్ర నాయకులు సుకర్నేని కోటేశ్వర్,జిల్లా కార్యదర్శి సోమన్న తో కలిసి మాట్లాడుతూ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న నిరవేదిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు  తెలుపు తున్నామని అన్నారు.అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని
మరియు వారి డిమాండ్లు ఉద్యోగ భద్రత, పే స్కేల్, ప్రమోషన్లు, 55 ఏళ్లు దాటిన వీఆర్ఏలకు వాలంటరీ రిటైర్మెంట్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు
లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీఆర్ఏల కు మద్దతుగా ఈఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  మండల బిజెవైఎం ప్రధాన కార్యదర్శి బోయిని మహేష్, వీఆర్ఏ జేఏసి మండల అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ఉపాధక్షులు అందే ఎల్లయ్య, శ్రీకాంత్, రఘు, యాకన్న,రాఘవులు,ఎండీ చతాబీ, ఎండీ షాజీదా తదితరులు పాల్గొన్నారు.