*వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి ఉపాధ్యక్షులు రాంబాబు.
చిట్యాల 28( జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 66వ రోజుకు చేరుకోగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు పాలెపు రాంబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పేస్కేల్ను వర్తింపజేసి ఆదుకోవాలని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్షత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించి సొంత గ్రామాలలో డబుల్ బెడ్రూంలో వంటి హామీలు ఇచ్చి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని 66 రోజుల నుండి మానసిక వేదనకు గురై 35 మంది చనిపోయినా కనీసం స్పందించకపోవడం చాలా విచారకరం. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దబ్బెట రాజు, సహాయ కార్యదర్శి వేణువంక రమణాచారి, భోగం సాంబయ్య, సరస్వతి ,సురేష్, సదయ్య, ఆనందం, లక్ష్మయ్య, రాజు, చిరంజీవి, నాగరాజు ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.