వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పకిడే రాజయ్య*
రేగొండ (జనం సాక్షి) : టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు పకిడే రాజయ్య అన్నారు. వీఆర్ఏలు తలపెట్టిన దీక్ష సోమవారం నాటికి 15 రోజు చేరుకుంది. ఈ దీక్షలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్చాలని అన్నారు. వెంటనే పే స్కేల్ జీవోను విడుదల చేయాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించ డంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. 15 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు. మాచర్ల వేణు, గడ్డం శ్రీకాంత్, మద్దెల రమేష్, బమ్మ రాజు, బండారి మధుకర్, సారంగపాణి, ఆనందం, జితేందర్, శ్రీకాంత్, సదానందం, వెంకటేశ్వర్లు, శిరీష, ప్రేమలత తది తరులు పాల్గొన్నారు.