* వీఆర్ఏల హామీలను అమలు చేయాలి.
చిట్యాల 10( జనం సాక్షి) అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏ ల మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె 78వ రోజుకు చేరుకోగా, ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేసి తాసిల్దార్ ,ఇతర కార్యాలయ సిబ్బందిని అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసి ఆదుకోవాలని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్షత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ లాంటి హామీలు ఇచ్చి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ,లేనిపక్షంలో రోడ్లు ఎక్కి దర్నా, రాస్తారోకోలు, మానవ హారాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు రాజు, సురేష్, రమణాచారి, సదయ్య, శ్రీనివాస్, సతీష్, రాజు,సదయ్య,ఆనందం, నవీన్, దేవేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.