వీఐపీల భద్రత తగ్గించి మహిళలకు భద్రత పెంచండి
ఢిల్లీ పోలీసులకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (జనంసాక్షి):
దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వీఐపీల భద్రత కోసం కేటాయించిన సిబ్బందిని తగ్గించి మహిళల భద్రతకు కేటాయించాలని సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. వీఐపీల భద్రతా సిబ్బందిని కుదించి.. వారిని ఢిల్లీ రోడ్లపై మహిళల రక్షణకు వినియోగించాలని స్పష్టం చేసింది. అలాగే, వీవీఐపీల భద్రతకు ఎంత మంది సిబ్బందిని నియమిస్తున్నారన్న దానిపై వివరాలు అందజేయాలని అన్ని రాష్టాల్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 11 వరకూ న్యాయస్థానం గడువు విధించింది. ఆ లోపల సమాధానం ఇవ్వని రాష్టాల్ర ¬ం సెక్రటరీలు ఫిబ్రవరి 16న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.వేలాది భద్రతా సిబ్బందిని న్యాయమూర్తులు, తదితర వీఐపీల రక్షణ కోసం కేటాయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు విభాగం గురువారం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. పోలీసుల వాదనలు విన్న ధర్మాసనం.. ఆ సిబ్బంది నుంచి చాలా మందిని తొలగించి ఢిల్లీ రమదారులపై మహిళలకు భద్రత ఉండేలా ఉపయోగించుకోవాలని పోలీసులకు సూచించింది. వీవీఐపీల రక్షణకు ఎంత మందిని కేటాయిస్తున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సోమవారంలోగా ఆయా వివరాలు సమర్పించాలని, లేని పక్షంలో ఫిబ్రవరి 16వ తేదీన రాష్టాల్ర ¬ం శాఖ కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.