వీధికెక్కిన విభేదాలువైయస్‌ఆర్‌సిపిలో ముసలం
జిల్లా కన్వీనర్‌గా మోషెన్‌రాజుకు ఉద్వాసన
ఏలూరు, జూలై 27 : పశ్చిమగోదావరి జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు ఉప ఎన్నికల తర్వాత బజారునపడ్డాయి. జిల్లా పార్టీకి సారథ్యం వహిస్తున్న దళిత నాయకుడు మోషెన్‌రాజుకు ఉద్వాసన పలికారు. పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చంచలగూడ జైల్లోనే తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్‌లో ప్రకటించారు. మోషెన్‌రాజును హైదరాబాద్ పిలిపించి మరీ ఆయనకు జగన్ తన నిర్ణయం తెలియజేశారు. కొవ్వురూ అసెంబ్లీస్థానం నుంచి మోషెన్‌రాజును వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాల్సిందిగా జగన్ చెప్పారని, అందుకే ఆ నియోజకవర్గంలో ఎక్కువ సమయం ప్రజలకు వెచ్చించాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కన్వీనర్ బాధ్యతలను నిర్వర్తించడం భారం అవుతుందన్న భావనతోనే ఈ పదవి నుంచి తొలగించినట్లు సుబ్బారెడ్డి ఆయనకు తెలియజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి రెండేళ్ళ పాటు కష్టపడి అంకితభావంతో జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలను నిర్వహించినందుకు మోషెన్‌రాజును అభినందించారు. సేవలను పార్టీ కేంద్ర పాలకమండలిలో వినియోగించుకోవాలని జగన్ ఆదేశించారని కూడా తెలియజేశారు. కొత్త కన్వీనర్‌గా పోలవరం ఎమ్మెల్యే కల్లం బాలరాజును నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.