వీరశైవ రుద్ర భూమి అభివృద్ధి కోసం 15 లక్షలు.
సమాజం సభ్యుల కు అందజేత.
తాండూరు జులై 20(జనంసాక్షి)తాండూరు విరశైవ సమాజం రుద్రభూమి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిదుల నుండి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విరశైవ సమాజం అద్యక్షులు పటేల్ శ్రీశైలం కు అందజేశారు. బుదవారం తాండూరు పట్టణం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ని సమాజ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పై
లట్ రోహిత్ రెడ్డి వీరశైవ రుద్రభూమి అభివృద్ధికోసం ఎమ్మెల్యే ఫండ్ లో నుంచి 15 లక్షల రూపాయలను సమాజా అధ్యక్షులు పటేల్ శ్రీశైలం కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ గాజుల శాంతు కుమార్ , ఉపాధ్యక్షులు, జి పరమేశ్వర్ స్వామి , కార్యవర్గ సభ్యులు ఘనాపూర్ శంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.