వీళ్లింతే..ఇక మారరు

కోల్‌కత్తా, డిసెంబర్‌ 5: సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కొనసాగుతోంది. ముంబైలో చేతుÛ లత్తేసిన మన క్రికెటర్లు… కోల్‌కత్తాలోనూ అదే బాటలో పయనించారు. స్పిన్‌కు మరీ అనుకూలంగా లేకు న్నా పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఫలితంగా మూడో టెస్టులో తొలిరోజు ఇంగ్లాం డ్‌దే పై చేయిగా నిలిచింది. గంభీర్‌, సచిన్‌ హాఫ్‌ సెంచరీలతో ఆదుకోకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్‌ గెలిచిన ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఊహించినట్టు గానే ఒక స్పిన్నర్‌ను తప్పించారు. హర్భజన్‌సింగ్‌ స్థానంలో ఇశాంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. అటు ఇంగ్లాండ్‌ కూడా ఒక మార్పు చేసింది. బ్రాడ్‌ స్థానంలో ఫిన్‌ను తీసుకుంది. భారత ఓపెనర్లు పాజిటివ్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. తొలి వికెట్‌కు గంభీర్‌, సెహ్వాగ్‌ 47 పరుగులు జోడించారు. అయితే అనవ సర పరుగు కోసం ప్రయత్నించిన వీరూ 23 పరుగుల దగ్గర రనౌటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గంభీర్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్‌ పెంచే ప్రయత్నం చేశాడు. ఈ దశలో పుజారా కూడా వెనుదిరిగాడు. అయినప్పటకీ… గంభీర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకు న్నాడు. 60 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర గౌతీ ఔటవగా… వెంటనే కోహ్లీ కూడా పెవిలియన్‌ చేరుకున్నాడు. దీంతో భారత్‌ 4 వికెట్లు చేజార్చుకుంది. ఈ పరిస్థుతుల్లో సచిన్‌ టెండూల్కర్‌, యువ రాజ్‌ జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా పేలవమైన ఫామ్‌లో ఉన్న సచిన్‌ సిరీస్‌లో తొలిసారిగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రారంభంలో నిలదొక్కుకునేందుకు చాలా సమయం తీసుకున్న మాస్టర్‌ క్రమం గా బ్యాట్‌కు పని చెప్పాడు. ఈ క్రమంలో 11 ఇన్నింగ్స్‌ల తర్వాత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు మాస్టర్‌కు సపోర్ట్‌ ఇచ్చిన యువీ 32 పరుగులకు ఔటయ్యాడు. సచిన్‌, యువరాజ్‌ ఐదో వికెట్‌కు 79 పరుగుల పార్టనర్‌షిప్‌ నమోదు చేశారు. కాన్ఫిడెంట్‌గా ఆడుతోన్న సచిన్‌ 76 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర కీపర్‌ ప్రయర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సమయంలో కెప్టెన్‌ ధోనీ, అశ్విన్‌ నిలక డగా ఆడుతూ స్కోర్‌ 250 దాటించారు. అయితే ఆట మరో మూడు ఓవర్లలో ముగుస్తందనగా అశ్విన్‌ను ఆండర్సన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జహీర్‌తో కలిసి ధోనీ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డాడు. చివరికి తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. ధోనీ 22, జహీర్‌ పరుగులేవిూ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌ 3, పనేసర్‌ 2, స్వాన్‌ 1 వికెట్‌ పడగొట్టారు.