వృక్షల తోనే మానవ మనుగడ
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
మరిపెడ, జులై 27(జనం సాక్షి): మానవ మనుగడకు, జీవకోటికి వృక్ష సంపద ప్రధానమైన వనరు అని అందు కోసమే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహరంతో తెలంగాణను పచ్చని తోరణంగా మార్చారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయన్ అన్నారు. బుధవారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని 6వ వార్డు పరిధిలో మున్సిపల్ ఛైర్మన్ గుగులోత్ సింధూర రవి ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ విడత హరిత హారంలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, వైస్ చైర్మెన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, తెరాస జిల్లా నాయకులు కుడితి మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న, కో ఆప్షన్ మెంబర్, మరిపెడ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర్‌రావు, జిల్లా తెరాసా నాయకుడు షేక్ ఆయూబ్ పాషా, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, తెరాసా నాయకులు, మరిపెడ మండల పార్టీ ఉపాధ్యక్షుడు నారెడ్డి సుదర్శన్ రెడ్డి, చందు, మరిపెడ పట్టణ ఉపాధ్యక్షుడు అంబటి వెంకట్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు బానోత్ శ్రీను, రేఖ లలిత వెంకటేశ్వర్లు, మాచర్ల స్రవంతి భద్రయ్య, పానుగోతు సుజాత వెంకన్న, పద్మకోటేష్, ఊరుగొండ శ్రీనివాస్, బానోత్ కిషన్, వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, బాదావత్ హతిరాం, ఎడెళ్లి పరశురాములు, బయ్య భిక్షం, గంధసిరి ఉపేంద్ర లింగమూర్తి, జాటోత్ కౌసల్యా గణేష్, కో ఆప్షన్ మెంబర్లు షేక్ మక్సూద్, షేక్ ఖైరున్ హుస్సేన్, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జాటోత్ బాలాజీ, తెరాస నాయకులు దేవరశెట్టి లక్ష్మీనారాయణ, మునిసిపల్ సిబ్బంది మురళి కృష్ణా, అన్సారి, అశోక్ రెడ్డి, గణేష్, నాగరాజు, వీరన్న, కేలోత్ శ్రీను, గంట్ల మహిపల్ రెడ్డి, ఉప్పల సతీష్, రేఖ రమేష్, శివ, తెరాస సోషల్ మీడియా ఇంచార్జ్ గోల్కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Attachments area