వృద్ధాశ్రమంలో మహాత్ముని మనవడు

4

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):చిన్నతనంలో జాతిపిత మహాత్మా గాంధీ ఒడిలో ఆడుకున్న ఆయన? ఇప్పుడు ఆలనా పాలనా చూసేవారు లేక ఓల్డేజ్‌ ¬ంలో ఉంటున్నారు. స్వయాన గాంధీ మనువడైనప్పటికీ? పలకరించేవారు కరువై సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. గాంధీజీ మూడో కుమారుడు రాందాస్‌ గాంధీ కుమారుడైన కానూభాయ్‌ గాంధీ? ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఓల్డేజ్‌ ¬ంలో తన భార్యతో పాటు ఉంటున్నారు. గాంధీజీ కుటుంబ సభ్యులు ఆయన ఆదర్శాలకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిల్లలు లేని కానూభాయ్‌ దంపతులు తమ జీవితంలో అధికభాగం అమెరికాలోనే గడిపారు. తమవారితో కలిసి చివరిరోజులు గడుపుదామని 2014లో ఇండియా వచ్చారు. బంధువులు ఆదరించకపోవడంతో విరక్తి చెంది, గుజరాత్‌ లోని ఒక ఓల్డ్‌ ఏజ్‌ ¬ంలో చేరారు. అయితే అక్కడ అంతగా కంఫర్ట్‌ లేక? ఆశ్రమాలు మారుతూ వచ్చి ప్రస్తుతం ఢిల్లీలోని గురువిశ్రాం వృద్ధాశ్రమానికి చేరుకున్నారు.ప్రస్తుతం 87 ఏళ్ల కానూభాయ్‌ గాంధీ దంపతులు ఉంటున్న ఆశ్రమంలో మొత్తం 130 మంది వృద్ధులు, 40 మంది సహాయకులు ఉంటున్నారు. వారందరికీ కలిపి నాలుగే టాయిలెట్లున్నాయి. ఈ ఆశ్రమంలో వీరిద్దరికి ఒక చిన్న ఏసీ గది ఇచ్చారు. గాంధీజీ మరణించినప్పుడు కానూభాయ్‌ 17 ఏళ్ల బాలుడు. చిన్నతనంలో గాంధీతో తనకున్న అనుబంధాన్ని కానూభాయ్‌ గుర్తు చేసుకున్నారు. తాతయ్య జుట్టు పట్టుకొని తాను లాగే వాడినని, తాతయ్య బోసి నవ్వులు ఇంకా గుర్తున్నాయన్నారు.కష్టకాలంలో తమ బంధువులెవరూ ఆదుకోవడం లేదని కానూభాయ్‌ గాంధీ ఆవేదన చెందుతున్నారు. బాపూజీ సంతానం ఆయనకు పూర్తి విరుద్ధమైన రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం చాలా మంది రాజకీయాల్లో గాంధీజీ పేరు ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారని విమర్శించారు.గాంధీజీ మరణం తర్వాత యూఎస్‌ వెళ్లిపోయిన కానూభాయ్‌ గాంధీ? అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. చాలాకాలం పాటు నాసా లాంగ్లీ రీసెర్చ్‌ సెంటర్‌ లో ఆయన పని చేశారు. అమెరికా రక్షణ శాఖలో కూడా విధులు నిర్వహించారు. ఆయన సతీమణి శివలక్ష్మి బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు.