వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి
షూపాలిష్ చేసి బిజెవైఎం వినూత్న నిరసన
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): నిరుద్యోగ సమస్యలపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భీంగల్ మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో షూ పాలిష్ చేసి నిరసన తెలిపారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు కొట్టాల అశోక్ మాట్లాడుతూ నీళ్లేమో దొర ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లినయని, నిధులేమో దొర అల్లుడి కట్నానికి పోయినయని, నియామకాలేమో దొర కొడుక్కి, సడ్డకుడి కొడుక్కి పోయినయనన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అని మనం సాధించుకున్న తెలంగాణ, దొర కాళ్ల దగ్గర బానిసగా మారిందన్నారు. యువత ప్రశ్నిస్తారనే భయంతో వాళ్లను గ్రిప్‌లో పెట్టుకోవడానికి మద్యానికి గంజాయికి బానిసలని చేస్తున్నారని, ఒక పక్క బాల్కొండ యువత ఉద్యోగాలు లేక డిప్రెషన్లలోకి వెళుతుంటే ఈ నాయకులేమో ఫంక్షన్ల పేరు విూద సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. నాయకులు తమ కొడుకులుని మాత్రం పెద్ద పెద్ద ఇంజినీర్లు, డాక్టర్లుగా మార్చి లైఫ్‌లో సెట్ అవుతున్నారని, కానీ తమకు ఓట్లు చేసిన జనాన్ని మాత్రం బానిసలుగా మార్చుతున్నారని ఆరోపించారు.
జనాల ఓట్లకు పుట్టిన నాయకులు చివరికి గెలిచాక ప్రజల్ని పట్టించుకోకపోవడం పుట్టిన కొడుకులు తల్లితండ్రుల్ని వద్ధాశ్రమంలో చేర్చిన పాపం అంటుకుంటుందన్నారు. ఈ సర్కారుకి నిరుద్యోగుల కల కల కొడుతుందన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై స్పందించాలని, ఉద్యోగాలను భర్తీ
చేయాలని, నిరుద్యోగ భతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ బాలకిషన్, నవతేజ్, నికెష్, సన్నీ, చిన్ని నరసయ్య, నరసయ్య యాదవ్, కస్తూరి శ్రీకాంత్, అజయ్, రాజు, రాజ్ కుమార్, లక్ష్మీనరసయ్య, యోగేశ్వర నరసయ్య, వెంకటేష్, సంగ్య నాయక్, గోపు అంజి, లింబాద్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.