వేగ సూచికలు ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
వేములవాడ రూరల్, నవంబర్ 9 (జనంసాక్షి) : ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అతివేగం వలన జరుగుతున్నందున వీటిని నివారించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో స్పీడ్ గన్ లను ఏర్పాటు చేస్తున్నారు. స్పీడ్ లిమిట్ తెలియజేసేలా బుధవారం ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో వేములవాడ-సిరిసిల్ల రహదారి వెంబడి సూచికలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై దిలీప్ మాట్లాడుతూ వాహనదారులు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డుపై నలబై, హైవేల దగ్గర 60 వేగం మించరాదని పేర్కొన్నారు. మూల మలుపులు, యూటర్న్ తీసుకునేటప్పుడు వాహనాలను గమనిస్తూ జాగ్రత్తగా వెళ్లాలని, ఎల్లప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.