వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలి.

షీ టీం ఎస్సై ప్రేమ్ దీప్.షీ టీం ఎస్సై ప్రేమ్ దీప్.
సిరిసిల్ల. నవంబర్ 9. (జనం సాక్షి). విద్యార్థినిలు వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని షీ టీం ఎస్సై ప్రేమ్ అన్నారు. బుధవారం షీ టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీ టీం ఉపయోగాలు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో షీ టీం ఎస్సై ప్రేమ్ దీప్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో బాలికలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులు ఒంటరిగా ప్రయాణిస్తున్న క్రమంలో సమస్యలు ఎదురవుతాయని మౌనంగా భరించకుండా షీ టీం సంప్రదించాలని సూచించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100 జిల్లా షీ టీం నెంబర్ 8712656425 లేదా షీ టీం ఎస్సై నెంబర్ 8712656424 ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.