వైఎస్సార్‌పార్టీ బిసిలకే ఏం చేయాలనుకుంటుందో …. యనమల

కాకినాడ, జూలై 21, : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బిసిలకు ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. తునిలో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ బిసిలకు తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే రాజకీయ సీట్ల కేటాయింపులో 50 శాతం బిసిలకు సీట్లు కేటాయించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నప్పటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మాత్రం వెనుకాడుతుందన్నారు. కాబట్టి భవిష్యత్తులో తమకున్న అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. ఈయన వెంట యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, ఎస్‌ లోవరాజు తదితరులు పాల్గొన్నారు.