వైఎస్సార్ సీపీ నేత చెవిరిరెడ్డి అరెస్టు
తిరుపతి, జూన్ 27 : తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మద్యపాన నిషేధంపై చేపట్టిన నిరహారదీక్షకు మద్దతుగా తిరుపతి బంద్ పాటించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో నిషేధించిన ప్రాంతంలో బంద్ పాటించాలని ఆయన 300 మంది కార్యకర్తలతో ప్రదర్శన జరపుతుండడంతో అరెస్టు చేశారు. వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపారు.