వైకల్య విజేతకు చిన్నారుల విరాళాలు
కరీంనగర్, జూలై 23 (జనంసాక్షి) : వైకల్య విజేత ఆయేషాకు పలుపురు చిన్నారులు విరాళాలు అందజేశారు. నగరంలోని వికేకానంద రెసిడెన్షియల్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి వి. సాంకృతిన్ రూపాయలు 2116లు, నాలుగవ తరగతి విద్యార్థి వి. విశ్వమిత్రా రూపాయలు 2116లు విరాళంగా ఇచ్చారు. వైకల్య విజేత ఆయేషా గురించి జనంసాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీంతో సోమవారం నగరంలోని జనంసాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చిన విద్యార్థులు పత్రిక ఎడిటర్ ఎం.ఎం. రహమాన్‌కు విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ విద్యార్థులను అభినం దించారు. చిన్నవారైనప్పటికీ విద్యార్థులు చాలా గొప్ప పనిచేశారనీ, వీరు మరి కొంత మందికి ప్రోత్సాహంగా నిలుస్తారనీ ఆయన ఆశించారు. వైకల్యాన్ని గెలిచి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆయేషాకు చేయూత న్విడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఆయేషాకు సహాయపడాలనుకొనేవారు జనంసాక్షి ప్రధాన కార్యాలయంలోగానీ ఫోన్ నెంబర్లు 0878-2245990, 2246990లలో సంప్రదించండి.