వైకాపాలో ‘దాడి’ ప్రకంపనలు
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే అపార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి రాకను వైకాపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో పాటు అనకాపల్లి నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన కొణతాల మాట్లాడుతూ… పార్టీలో చేరే వారిలో కొంతమంది స్వార్థపరులు , కొందరు ఉపయోగపడేవారు ఉంటారని దాడిని ఉద్దేశించి అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలన్నారు. దాడి వల్ల తాను గతంలో సర్వనాశనమైన మాట వాస్తవమేనన్నారు.