వైకుంఠ రథం ప్రారంభం.
బెల్లంపల్లి, అక్టోబర్21,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణ ప్రగతి నిధుల నుంచి మంజూరైన వైకుంఠ రథాన్ని శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజల సౌకర్యార్థం పట్టణ ప్రగతి నిధుల ₹ 13.50 వ్యయంతో వైకుంఠ రథం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.