వైద్యంలో నిర్లక్ష్యం… పసికందు మృతి
గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : వైద్యసహాయంలో చూపి న నిర్లక్ష్యంతో ప్రసవంలోనే పసికందు మృతిచెందింది. శుక్రవా రం జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రైవేట్ ఆసు పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతో జరిగిం దంటూ న్యాయవాదులు, పలు ప్రజా సంఘాల బాధ్యులు ఆందోళన కు దిగారు. పోలీసులకు, జిల్లా వైద్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ నిర్వహించారు. చివరకు పసికందుకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిం చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగ రసమీపంలోని పెద్దంపేట్ గ్రామానికి చెందిన కుడిది వెంకటేష్ అనే న్యాయ వాది తన భార్య హారికను రెండవ ప్రసవం కోసం నొప్పులు రావడంతో గురువారం సాయంత్రం స్థానిక కళ్యాణ్‌నగర్‌లోని లక్ష్మివాణి ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే మరో పదిరోజుల్లో ఆమెకు ప్రసవం తేదీని నిర్ణయించగా, ఈ నొప్పులు పురిటినొప్పులు కావని మామూలు నొప్పులని వైద్యాన్ని ఆసుపత్రి వైద్యు రాలు ప్రారంభించింది. కాగా, గురు వారం అర్ధరాత్రి దాటిన తరువాత గర్భం నుంచి శిశువు బయటకు వ స్తుండటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సమయంలో ఆసుపత్రి నిర్వా హకులు సరైన వైద్యం అందించకపోవడంతో ప్రసవం నుంచి బయటకు వచ్చిన మ గశిశువు క్షణాల్లోనే కళ్ళు మూసింది. దీంతో కుడిది వెంకటేష్ పక్షాన నగర న్యాయవాదులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఒకదశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెనువెంటనే ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్యాశాఖాధికారులు ఆదేశం మేరకు స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయమాల పరిస్థితిపై విచారణ జరిపారు. వన్‌టౌన్ సీఐ ఎడ్ల మహేష్ సంఘటన స్థలానికొచ్చి విషయాన్ని తెలుసుకున్నారు. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులతో పాటు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుడిది వెంకటేష్ ఫిర్యాదు మేరకు వైద్యంలో చూపిన నిర్లక్ష్యంతో పసికందు మృతికి కారణమైన నేరంపై ఆసుపత్రి డాక్టర్ లక్ష్మివాణి, నర్సు సుల్తాన్‌లపై ఐపీసీ 304(ఎ) సెక్షన్ క్రింద కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. పసికందు మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోసు ్టమార్టం నిర్వహించారు. కాగా, తన వైద్యంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపలేదని ఆసుపత్రి డాక్టర్ లక్ష్మివాణి తెలిపారు.