వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
పెద్దపల్లి, ఆగస్టు 7 (జనంసాక్షి) : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రని జిల్లా వైద్య సమన్వయ అధి కారి డాక్టర్ అజ్మెర్ భోజానాయక్ మంగళ వారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసు పత్రిలోని నీటి సదుపాయాన్ని పరిశీలించారు. వైద్యులు చేస్తున్న వైద్యం గురించి రోగులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉప యోగకరంగా అన్ని సదుపాయాలు కల్పించామని అందువల్ల గ్రామాలలలోని ప్రజలు ప్రభుత్వ వైద్యశాలను వినియోగించుకుని తమ రోగాలను నయం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆసు పత్రిలోని ఇద్దరు వైద్యులు బదిలీ పై వెళ్లడంతో వారి స్థానంలో కొత్త వారిని పంపడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో నీటి సదుపాయం సరిగా లేనందున ప్రజలు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆసుపత్రిలో బోర్లు వేయిస్తారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైద్యసిబ్బంది ఉన్నారు.