వైద్యుల పదవీవిరమణ 65 ఏళ్లకు పెంపు
– త్వరలో కెబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం
– వారానికో రోజు ఉచిత వైద్య సేవలందించండి
– అభివృద్ధి ఫలాలు ప్రజలముంగిట చేర్చాం
– రెండేళ్లపాలనపై మోదీ వివరణ
షహరాన్‌పూర్,మే26(జనంసాక్షి): వైద్యుల పదవీ విరమణ గడువు 65 సంవత్సరాలకు పెంపుపై త్వరలో కెబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలను ప్రధాని షహరన్ పూర్ నుంచి ప్రారంభించారు. సహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.ఈ ఏడాదిలో 12 రోజులు పేదలకు సేవ కోసం కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేటు డాక్టర్లకు పిలుపునిచ్చారు. పేద గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్యం చేయాలని కోరారు. ప్రతి నెలా 9వ తేదీ తమ వద్దకు వచ్చే పేద గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్యం అందించాలని సూచించారు. వైద్యం ఖరీదుగా మారడం అదే సమయంలో పేద గర్భిణీ స్త్రీలు నానా ఇబ్బందులు పడుతుండటంతో ప్రధాని డాక్టర్లకు ఈ సూచన ఇచ్చారు. స్వచ్ఛ భారత్ పథకం పేద ప్రజల కోసమేనని, ఆరోగ్యంగా ఉండటం కోసమే ఆరోగ్యకరమైన పరిసరాల అవసరం ఎంతైనా ఉందన్నారు. వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టేకన్నా రోగాలు రాకుండా స్వచ్ఛమైన అలవాట్లు చేసుకోవాలన్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తున్నాదని ప్రధాని మోడీ చెప్పారు. రెండేళ్ల క్రితం ఉన్న యూపిఏ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని మోదీ చెప్పారు. ఈ రెండేళ్‌ల్లో పాలనను పోలిస్తే విషయం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్టాల్రను బలోపేతం చేసేందుకు యత్నించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఖజానాలోని ఆదాయంలో 65 శాతం రాష్టాల్రకు పంచుతున్నామని, కేంద్రం వద్ద 35 శాతం ఆదాయం మాత్రమే ఉంచుతున్నామని చెప్పారు. అధికారం వచ్చినప్పటి నుంచీ పేదలు పేదరికంపై పోరాడి విజయం సాధించేలా పథకాలు రూపొందించామన్నారు. రైతుల మేలు కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి వివరించారు. బీమా ద్వారా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. ఈసారి వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టునూ కాపాడుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు వస్తూంటాయి..పోతుంటాయని .ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమైన విషయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సందర్భంగా షహరన్‌పూర్‌లో ఏర్పాటుచేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రజల కలలు సాకారం చేసినప్పుడే నిజమైన ప్రభుత్వాలుగా గుర్తింపు పొందుతాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్టాల్రను బలోపేతం చేసే పక్రియను ప్రారంభించామన్నారు. కేంద్రం వాటా నుంచి 42 శాతం నిధులను రాష్టాల్రకు కేటాయించడం స్వతంత్ర భారతదేశంలో గొప్ప ముందడుగన్నారు. స్థానిక సంస్థలు, పంచాయతీలను బలోపేతం చేసేందుకు నేరుగా నిధులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్‌ను చూసి చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతీ జిల్లాలో ప్రతీ రైతు పొలానికి నీరు ఎలా వెళ్లాలో ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. కొత్త పంటల బీమా పథకంతో మూడో వంతు పంట నష్టం జరిగినా పరిహారం లభిస్తుందన్నారు. పండిన పంట చివరి దశలో ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినా రైతులకు భీమా లభిస్తోందన్నారు. అంతకు ముందు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రెండేళ్లలో పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. దీనికిమెచ్చిన జనం ఈశాన్య భారతంలో తొలిసారి అవకాశం కల్పించారన్నారు. ఇతర పార్టీల నేతలు ప్రజలు తమ జేబుల్లో ఉన్నారనుకొని ఐదేళ్లలో ఏవిూ
చేయరని.. కానీ తమ ప్రభుత్వం ప్రజలే తమకు యజమానులు అనుకొని పనిచేస్తుందన్నారు. రైతుల కష్టాలు తమ ప్రభుత్వానికి తెలుసన్నారు. భారత్‌లో ఇంతవరకు ఫసల్ బీమా యోజన వంటి పథకం రాలేదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రైతులను ఆదుకునేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందన్నారు.
ఎన్‌డిఎ చురుకుగా పనిచేస్తోంది
తమ ప్రభుత్వం చురకుగా పనిచేస్తోందని, గతంలో కన్నా అత్యంత వేగంగా నిర్ణయాలు తసీఉకుని ముందుకు సాగుతోందని ప్రధాని మోడీ అన్నారు. నేటి భారతదేశం మునుపటిలా ఎక్కడో మూలన పడి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాల కంటే అత్యధిక సంస్కరణలను ఇటీవల తన ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ప్రపంచ వేదికపై భారతదేశం మూలన నిల్చుని ఉండే పరిస్థితి పోయిందన్నారు. ప్రముఖ అమెరికా పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండేళ్ళ తన ప్రభుత్వ విజయాలను, భవిష్యత్తులో సాధించదల్చుకున్న అంశాలను వివరించారు.న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారతదేశం ప్రపంచ వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. భారతదేశంలో వేగవంతమైన వృద్ధి కోసం తాను మార్గాన్ని ఏర్పాటు చేశానని, ఆ మార్గంలో ప్రయాణించడానికి రాష్టాల్రు ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యధిక సంస్కరణలను తాను చేపట్టానని, భవిష్యత్తులో చేయవలసినది ఇంకా చాలా ఉందని వివరించారు. విదేశీ పెట్టుబడుల కోసం భారీ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు మార్పులు చేశానని, గ్రావిూణ మౌలిక సదుపాయాల్లో లోపాలను సరిదిద్దినట్లు చెప్పారు. వ్యాపారం చేయడం సులువు అనిపించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అత్యంత కీలకమైన వస్తువులు, సేవల (జీఎస్‌టీ) బిల్లు ఈ ఏడాది పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను విక్రయించడం పట్ల ప్రదాని మోదీ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ మైనారిటీ వాటాల నుంచి తప్పుకోవడం కొనసాగుతుందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్న రంగాల్లో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కీలక పాత్ర పోషించవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగం నుంచి అకస్మాత్తుగా బయటపడటం సాధ్యం కాదని, అలా వదిలించుకోకూడదని చెప్పారు.