వైద్య పరీక్షలకు ముద్రగడ అంగీకారం
రాజమహేంద్రవరం,జూన్ 15(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించినట్లు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఐకాస సభ్యులుగా తాము పలు దఫాలుగా ముద్రగడతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ముద్రగడకు వివరించామని… దీంతో శరీరంలోకి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆయన దీక్ష మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేశారు.తుని ఘటనపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారికి బెయిల్ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చర్చలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.