వైద్య బృందం పర్యటన

వీపనగండ్ల ఆగస్టు 27 (జనంసాక్షి) ఈరోజు వీపనగండ్ల మండలంలోని వెలుగొండ గ్రామానికి రాష్ట్ర మలేరియా మరియు ఫైలేరియా అడిషనల్ డైరెక్టర్ శ్రీ అమర్ సింగ్ నాయక్ మరియు రాష్ట్ర మలేరియా ఫైలేరియా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వెంకటేష్  ఆధ్వర్యంలో వైద్య బృందం సందర్శించి మెదడు వాపు వ్యాధి వచ్చిన ఇంటి పరిసరాలను పరిశీలించి గ్రామంలో నివారణ చర్యలు భాగంగా నిర్వహించిన జ్వర సర్వే, ఫోకల్ స్ప్రే, డిడిటి, పైరేత్రం స్ప్రే మరియు ఫాగింగ్ చేసిన రిపోర్టులను పరిశీలించి దోమలు గుడ్డు పెట్టే ప్రాంతాలలో గంభూజియా చేపలను వదలడం జరిగింది. మరియు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు కుట్టకుండా,  పుట్టకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. ఈ బృందంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీ రవిశంకర్, ప్రాథమిక కేంద్ర వైద్యాధికారి శ్రీ వంశీకృష్ణ, జిల్లా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ జీ, మరియు శ్రీ మురుగన్ గారు పాల్గొనడం జరిగింది.