వైభవంగా సంకటహర చతుర్దశి ¬మం

-భక్తులతో కిటకిటలాడిన మహాశక్తి దేవాలయం

కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): సంకటాలను హరించి ప్రతి ఒక్కరికి మంచి చేసే దేవదేవుడిగా పేరుగాంచిన,పూజల్లో అగ్రపూజలను అందుకునే విజ్నేశ్వర స్వామికి సంకటహర చతుర్దశి సందర్బంగా మంగళవారం నగరంలో దేవాలయాల్లో వివిదరకాల పూజాదికాలు నిర్వహించారు. నగరంలోనే కాక తెలం గాణా రాష్ట్రంలో మహిమాన్విత దేవస్థానంగా అనతికాలంలోనే భక్తుల హృదయాలను దోచుకున్న జ్యోతినగర్‌లో వెలసిన మహాశక్తి దేవా లయంలో సంకట హరచతుర్దశి సందర్బంగా ఉదయం సహస్ర మోదుక ¬మం నిర్వహించి విఘ్నేశ్వరుడికి పల పంచామృతాలతో అభి షేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యదిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈసందర్బంగా సహస్ర మోదుకల ¬మం కార్యక్రమాన్ని తిలకించేందుకు పాల్గొనేందుకు మహిళలు అత్యధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిట లాడింది. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ¬మం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తనవంతుగా పాల్గోని సంతృప్తిని వ్యక్తం చేశారు. భక్తులతో స్వయంగా నిర్వహించే కార్యక్రమం కూడా కావడంతో ఆలయానికి భక్తులు అత్యదిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దేవాలయం మహిమ నాటినాటికి విస్తరిస్తుండడంతో నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా భక్తులుకూడా ఎంతో అనుభూతిని పొందుతున్నారు. ¬మం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కొరిడే శ్రీనివాస్‌శర్మ, కొరిడే శ్రీదర్‌ శర్మ, వంశీ, విష్ణుశర్మ, లక్ష్మణ్‌శర్మలు శాస్తోక్త్రంగా ¬మం కార్య క్రమాన్ని నిర్వహించారు. వెయ్యి మోదుగలతో ఈ సంకట హర చతుర్దశి కార్యక్రమంను అంగారక సంకటహర చతుర్దశిగా నిర్వహించారు