వైవిధ్యం కాదు జీవ విధ్వంసం

జీవ 2012 అక్టోబర్‌లో పంతొమ్మిది రోజులపాటు జీవవైవిధ్యంపై హైదరాబాద్‌లో ఒక తమాషా జరిగింది. చూడ్డానికి ఒక తమాషాగా, సర్కస్‌లాగా, తిరునాళ్లలాగా ఉన్నా దీని వెనుక ఒక పెద్ద దుర్మార్గమే ఉంది. ఒక అప్రజాస్వామిక దాడి ఉంది. అసలు ఆ సమావేశంలో జరిగిందో చర్చించే ముందు అసలు ఆ సమావేశం వెనుక ఉన్న దురుద్దేశాన్ని, కుట్రని అర్థం చేసుకోవాలి.జీవ వైవిధ్యం ప్రకృతి మనకిచ్చిన గొప్ప సంపద. సమస్త జీవుల ఉనికికి ఆధారం. లక్షల రకాల జీవుల సహజీవనం, పరస్పర సహకారం, హననం – జీవ వైవిధ్యం ఒక గొప్ప సంరంభం కలాలకు అనుగుణంగా, రుతువుల చక్రంలో నవనవలాడుతూ, వాడిపోతూ, వర్ధిల్లుతున్న వైవిధ్య భరితమైన ఉనికి మనది. (కేవలం మనదే అనుకోవడం స్వార్థమూ, అన్యాయమూ. అది సమస్త ప్రాణిజాతికి సంబం ధించినది.) వేల సంవత్సరాలుగా ప్రకృతితో, ప్రకృతిలో ఉండి జీవ వైవిధ్యాన్ని కాపాడింది మనం. మనం అనేకంటే ఆయా దేశాల్లో ఉండే మూలవాసులు, రైతులు, ఇంకా ప్రకృతితో ప్రత్యక్ష సంబం ధాల్లో ఉండిన మెజారిటీ ప్రజలు.నాగరికత పేరుతో ప్రకృతిపై, సహజ వనరులపై దాడి ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచే జీవ వైవిధ్యానికి అవకాశం మొదలైంది. ఎప్పుడైతే మన అవసరాల కోసం కాకుండా ఆడంబరాల కోసం, సౌఖ్యాల కోసం సహజ వనరు ల్ని విచక్షణా రహితంగా వాడడం మొదలు పెట్టామో అప్పటి నుంచి భూమ్మీద ఎక్కడో ఒకచోట ఏదో ఒక జీవధాతువుకు వినాశనం కలగడం మొదలైంది.ఈ జీవవైవిధ్య సమావేశాలకు అసలు లక్ష్యం జీవవైవిధ్యాన్ని కాపాడడం కాదు. విచ్చలవిడి దోపిడీకి, సైన్స్‌ పేరుతో ప్రకృతిపై ప్రమాదకరమైన దాడికి మరికొన్ని అనుమతులు తీసుకోవడం. మరికొన్ని జాతుల అంతానికి, ఇంకొన్ని వనరుల కైంకర్యానికి తోవను తయారు చేసుకోవడం. ఇది మొదటికుట్ర. రెండోది చర్చలో మనల్ని భాగస్వాములు కాకుండా చూసి జీవవైవి ధ్యంపై తమదే చివరిమాట అని నిరూపించడం. జీవవైవిధ్యం సజీవంగా సమతుల్యంగా ఉంటే మనం బాగుంటాం. అది కేవలం మన అవసరమే కాదు, మన బాధ్యత కూడా. అందుకే కొన్ని వేల ఏళ్లుగా దాన్ని కాపాడుకుంటూ అందులో భాగమై బతుకుతున్నాం. జీవవై విధ్యాన్ని దెబ్బతీస్తే మనకి నష్టం. కానీ వాళ్లకి లాభం. ఏ విషయంపైన చర్చలోనైనా ఆ విషయంలో భాగస్వాములైన, లాభనష్టాలకు గురయ్యేవాళ్లందరికీ భాగస్వామ్యం ఉండాలి. నువ్వు గెలుస్తావా, ఓడుతావా అన్నది తరువాత విషయం. కానీ చర్చలో భాగస్వామ్యం ఉండడం అనేది కనీస ప్రజాస్వామిక హక్కు కానీ జీవవైవిధ్యానికి హాని జరిగితే నష్టపోయే పక్షానికి ఈ ప్రపంచస్థాయి చర్చల్లో ప్రాతినిధ్యం అస్సలే లేదు. కేవలం ప్రాతినిధ్యం లేకపోవడం మాత్రమే కాదు, వాళ్లెవరూ కనీసం రెండు మూడు కిలోమీటర్ల చుట్టుపక్కలకి రాకుండా ఎన్నో అంచెల భద్రతను పెట్టారు. చర్చను పూర్తిగా తమ చేతుల్లో పెట్టుకొని ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వదల్చుకున్నారు. ‘మీ జీవవైవిధ్యానికి మేం పరిమితులు పెడు తున్నాం. మీరేమీ చేయలేరు, మీకా ఆస్కారం లేదు’ అని.

అస్సలే అసమ్మతి గొంతుకకు చోటులేదా అంటే, ఉంది. అది మైనారిటీ గొంతుక. ఏవో కొన్ని ఎన్‌జీవోలకు ఇందులో చాలా కొంచెం స్థానం కల్పించారు. వీళ్లది ఎంత మెజారిటీ అంటే పదివేల మంది పట్టే హెచ్‌ఐసీసీ కన్వెన్షన్‌ హాల్లో ప్రధాన సమావేశాలుంటే, కేవలం పాతిక ముప్పై పట్టే చిన్న గదులకే వీళ్లని పరిమితం చేశారు. భిన్నస్వరాల వారు మాట్లాడితే భిన్నస్వరాల వారు విన్నారు. కానీ, ప్రధాన సమావేశాల్లో ఈ స్వరాలకు ఈ స్వరాలకు చోటు అసలే లేదు. ఇది పశ్చిమదేశాలు, ముఖ్యంగా అమెరికా కనిపెట్టి, అద్వితీ య నైపుణ్యం సంపాదించిన విద్య. ఏదైనా విషయం పట్ల ముఖ్యంగా ప్రజాస్వామ్యం, హక్కులు, హింస, పేదరికం వంటి వాటిలో గోల లేదా చప్పుడు (నాయిస్‌)ని అనుమతిస్తారు. ఈ గోల వల్ల చప్పుడు వల్ల మధ్య తరగతి ప్రజలు ఏదో ముఖ్యమైన చర్చ జరుగుతోందిలే అన్న భ్రమకు లోనవుతారు. ఆయా ప్రభుత్వాలు ఆయా విషయాల్లో ఎంత అనైతికంగా, అన్యాయంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రవర్తించాయో మరుగున పడిపోతుంది. విజయవంతగా ఆ దేశాలు అనుకున్న పనులు పూర్తి అయిపోతాయి. సరిగ్గా జీవవైవిధ్యం పట్ల హైదరాబాద్‌ సమావేశాల్లో అదే జరిగింది. వాళ్లందరూ (అంటే ప్రభుత్వాలు, మల్టీనేషనల్‌ కంపెనీలు) జీవ వైవిధ్యం గురించి చర్చలు చేస్తాయి. పత్రికలు విపరీతమైన ప్రచారం కల్పిస్తాయి. ‘అందరు భాగస్వాములకు స్థానం లేని చర్చలివి’ అని ఎక్కడా విమర్శరాదు. అందువల్ల అవి అప్రజాస్వామికంగా జరుగుతున్న చర్చలు అని కూడా ఎవరూ అనరు. ఒకవేళ ఏ విశాఖ పట్నంలోనో, హైదరాబాద్‌లోనో ఈ సమావేశానికి వ్యతిరేకంగా చర్చ జరిగితే దానికి ఇక్కడ జీవవైవిధ్య వార్తలకు ఇస్తున్న ప్రాము ఖ్యత ఇవ్వంరు. ఒకవేళ ఇచ్చినా ఏదో పిల్లపత్రికలో ఒకమూల ఎక్కడో చిన్నవార్త వస్తుంది. అంటే చర్చ విజయవంతంగా మన చేతిలోంచి జారిపోయిందన్నమాట. మన మనుగడకు చాల ముఖ్యమైన చర్చలోంచి మనం పక్కకు తొలగించబడుతాం. మనమ ందరమూ ఏదో తమాషా చూసినవాళ్లమైపోతాం. ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా వంద కోట్లతో జీవవైవిధ్యంపై ఒక మ్యూజియం వెలుస్తుంది. మనకు సంబంధించిన వ్యవసాయ సంపద చిహ్నాలు, విత్తనాలు, జ్ఞానం ఆ మ్యూజియంలో వస్తువులైపోతాయి.మూడో కుట్ర -చర్చకు పెట్టిన విధివిధానాలు. జీవవైవిధ్యానికి అసలు నష్టమెలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందీ, దానికి బాధ్యులెవరు, అందువల్ల అంతరించి పోతున్న జాతులేవీ, నష్టపోయే వారికి నష్టపరిహారమెంతా, అది ఎవరు చెల్లించాలి, ప్రకృథతికి పూడ్చలేని నష్టం వాటిల్లితే దానికి బాధ్యులెవరు-ఇవీ న్యాయబద్దంగా చర్చకు రావల్సిన అంశాలు. ఇంకా మనలాంటి దేశాల్లో జరుగుతున్న సహ జ వనరుల దోపిడీ, పర్యవసానంగా జరిగే పర్యావరణ హననం, దెబ్బతినే మానవ, జంతు, వృక్ష జాతులు-వీటి రక్షణ చర్చకు రావా లి. ఇవీ మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు. కానీ వాళ్లకి కావాల్సినవి ఇవి కావు. వాళ్లకి కావల్సినవి భిన్నమైనవి. వాళ్ల లక్ష్యాలు వేరు. అవి మన ప్రయోజనాలకు, మనుగడకు భంగం కలిగించేవి. అందుకే చర్చల నుంచి మనల్ని చాలా కుట్రపూరితంగానే దూరంగా ఉంచా రు. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ. ఇది మోనోకల్చర్‌కు దారి తీస్తుందని ఇప్పటికే రుజువైంది. (మోనోకల్చర్‌ అంటే ఏదో ఒక జాతి మొక్క మాత్రమే ప్రధానమైపోవడం. ఉదాహరణకు మనదేశంలో పత్తి. ఇది మరే పంటలకు స్థానం లేకుండా చేసు&ంది. మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో పత్తి వరి పంట విస్తీర్ణాన్ని మించి పోయింది. ఇది మోనోకల్చర్‌కు దారి తీసింది. కొన్ని దేశాల్లో మొక్కజొన్న, సోయావంటివి మోనోకల్చర్‌గా అవతరిస్తున్నాయి. ప్రకృతిలో అన్ని పంటలు సమానంగా ఉంటేనే జీవవైవిధ్యం సమతుల్యంగా ఉంటుంది. ) వ్యాపారానికి అవసరమైన మొక్క తప్ప పొలంలోని మిగతా వృక్ష, ప్రాణి జాతినంతటినీ నాశనం చేయడమే ఈ టెక్నాలజీ లక్ష్యం. అంటే పంట పంటకోసమే. పం టలకి లాభం చేసే పురుగూ పుట్ర, మొక్కలూ ఉంటాయనేది రైతులు కనిపెట్టిన జ్ఞానం. అది ప్రకృతిలో అన్నీ సమానంగా పెరగాలి అన్నది సహజన్యాయం. అది జీవవైవిధ్యానికి సంబంధించిన అంశం. కలుపు మొక్కల్ని ఏరి వేయడం, పంటలకి నష్టం కలిగి ంచే చీడ,పీడల్ని వేపరసం వంటి సహజసిద్ధమైన మందుల్ని వాడి తొలగించడంతరాలనాటి సమూ హిక విజ్ఞానం. కాని బయో టెక్నాలజీ ఏంచేస్తుందంటే, మొక్కల్నే విషపూరితం చేస్తుంది. అటువంటి మొక్కల్ని తిని రసం పీల్చే పురుగులు చనిపోతాయి. కాబట్టి మొక్క బతికి మంచి దిగుబడి వస్తుంది. అని బయో టెక్నాలజీ చెప్తుంది. లేకపోతే మొక్కకు పురుగుమందుల్ని తటు ్టకునే జీన్స్‌ ఎక్కిస్తారు. ఆ తరువాత మొఇత్తం పంటమీద పురుగు మందుని కొడతారు. ఆ జీన్స్‌ లేని మొక్కలు, క్రిమికీ టకాలు చచ్చిపోతాయి. కానీ అసలు పంటకేమీ కాదు. మొక్క లకి సహజసిద్దమైన బలం ఇచ్చి, వాటిని పురుగుల దాడికి సంసిద్ధం చేస్తే ఎక్కువ ఉపయోగం అన్న సూత్రానికి బయో టెక్నా లజీ వ్యతిరేకం. ఇట్లాంటి టెక్నాలజీలకి దారి సుగమం చేయడమే ఈ జీవవైవిధ్య సదస్సు అంతిమలక్ష్యం. చర్చ జీవవైవిధ్యం మీద అంఆరు. కాని అసలు చర్చేమో (నగోయా సప్లిమెంటరీ ప్రోటోకాల్‌) మార్చబడ్డ జీవధాతువులు (మాడిఫైడ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్స్‌), వాటివల్ల కలిగే నష్టాలు, వాటిని పరిష్కరించడం మీద ఉంటుంది. ఆ సదస్సులో 19 రోజుల చర్చల్లో వచ్చిన అన్ని విషయాల గురించి మాట్లాడడం ఇక్కడ సాధ్యం కాదు కాని, ఈ ఒక్క నగోయా ప్రోటోకాల్‌ అంశం చూస్తే చాలు ఈ సమావేశం అసలు లక్ష్యం మనకు అర్థమైపోతుంది. ఈ ప్రోటోకాల్‌ లక్షాఓ్యలు, వాళ్‌ల మాటల్లోనే, ప్రధానంగా రెండు, ఒకటి జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం. రెండు లివింగ్‌ మాడిఫైడ్‌ ఆర్గానిజమ్స్‌ (బీటీ కాటన్‌లో వాడే జీన్‌ లాంటిది), వాటివల్ల జరిగే నష్టాలకు బాధ్యత వహించడం, ఆ నష్టాలకు గురయ్యేవాళ్లకు పరిష్కారం చూపిం చడం. ఈ రెండు లక్ష్యాలు ఎంత పరస్పర విరుద్దమైనవో చూడండి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి అంటే. ప్రకృతిమీద దాడి చేయకుండా ఉండాలి. కాని వీళ్ల అసలు లక్ష్యం జీవవైవిధ్యాన్ని కాపాడడం కాదు. దానిమీద దాడిచేయడం. లివింగ్‌ మాడిఫైడ్‌ ఆర్గానిజమ్స్‌తో వ్యాపారం చేసే బయోటెక్నాలజీ కంపెనీల ్పయోజనాల్ని పరిరక్షించడం. అంటే పచ్చని ప్రకృతిలో కృతమైన, ప్రమాదం జీన్స్‌ను ప్రవేశపెట్టడం. వ్యవసాయరంగంలో బయోటెక్నాలజీ ప్రమా దం కాదనీ, పెరుగుతున్న ఆహార అవసరాలకు అది అవసరం అని అన్యాపదేశంగా ఈ ప్రోటోకాల్‌లో చెప్తారు. కానీ నష్టపరిహారం గురించి, అవి సృష్టించే ప్రమాదాల గురించి సీరియస్‌గా మాట్లా డరు. దీనికి రుజువేమిటంటే ప్రపంచ వ్యవసాయాన్ని బయోటె క్నాలజీతో నింపేస్తుంది. అమెరికన్‌ విత్తన కంపెనీలు. ఎప్పటి నుంచో అమెరికా ఈ బయోటెక్నాలజీని వాడుతున్నదని, కాబట్టి మనకు ఆందోళన అవసరం లేదని, మనం కూడా వాడొచ్చని కొందరు వాదిస్తారు. కానీ చిత్రమేమిటంటే అమెరికా ఈ ప్రోటోకా ల్‌ను అంగీకరించదు. ఇంతవరకూ దీనిపై సంతకం పెట్టలేదు. అంటే బయోటెక్నాలజీ వల్ల జరిగే అనర్థాలకు మాకేమీ బాధ్యత లేదని ప్రకటించడమే. బయోటెక్నాలజీ వల్ల నష్టం లేదంటూనే, అవసరం అంటూనే ప్రమాదం జరిగితే మాత్రం బాధ్యత తీసుకోవడానికి సంసిద్దంగా లేవు. అమెరికా , యింకా అనేక పశ్చి మదేశాలు. సరిగ్గా అణువిద్యుత్‌ కేంద్రాల విషయంలో కూడా ఇలాం టి వాదనలే వింటుంటాం. అణువిద్యుత్‌ వల్ల ప్రమాదం లేదని, క్షేమమని అంటారు. కానీ నష్టపరిహారం విషయంలో మాత్రం బాధ్యతని ఒక బిలియన్‌కో, రెండు బిలియన్లకో కుదిస్తారు. నష్టమే లేకపోతే, ప్రమాదమే కాకపోతే నష్టపరిహారం ఒప్పుకునే విషయంలో బయమెందుకో ? ఎందుకంటే అటు వ్యవసాయరంగంలో బయోటెక్నాలజీ గానీ, అణువిద్యుత్‌ కేంద్రాలు గానీ ఎప్పటికైనా ప్రమాదమేనని, ఉపద్రవం తప్పదని వాళ్లకి కూడా తెలుసు. ఏదో రో జు అవి భూమికి కడుపుకోత మిగిలిస్తాయని క ఊడా వాళ్లకి తెలుసు. అందుకే ఈ విషయంలో వాళ్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఈ జీవవైవిధ్య సదస్సు మార్కెట్‌ శక్తుల ప్రమాదకర ప్రయోగశాలకు అడ్డూ అదుపూ లేని బాధ్యత పడాల్సిన అవసరం లేని అనుమతులు తెచ్చుకోవడానికే అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక ఈ సమావేశాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి గురించి చెప్పుకోవడానికి ఇంకో వ్యాసమే రాయాల్సి ఉంటుంది. దాదాపు 500 కోట్ల రూపాయల నిదులు దీనికోసం మంజూరవగా ఏదో కొద్దిశాతం మాత్రం ఖర్చుపెట్టారు. ప్రధానమంత్రి పరువు కాపాడ్డానికి నిస్సిగ్గుగా కొందరు జర్నలిస్టులను ఎలా అడ్డుకున్నారో తెలంగాణ జీవవైవిధ్యం గురించి దాని గుంజాటన గురించి ప్రపంచానికి తెలియకుండా ఎలాంటి కట్టడి జరిగిందో కూడా చూశాం. ఇది జీవ వైవిధ్య సదస్సు కాదు. ఇది జీవవైవిధ్య నాశనం గురించి జరిగిన సదస్సు.

– కె.వి. కూర్మనాథ్‌,

(వీక్షణం సౌజన్యంతో)