వై ఎస్ షర్మిల అక్రమ అరెస్ట్ కు నిరసనగా ధర్నా

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రం లో మహిళలల పై జరుగుతున్న ఆగాయిత్యాలకు నిరసనగా ట్యాంక్ బండ్ రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగిన వైఎస్ షర్మిల అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని స్థానిక బాబు జగజ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అతహర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కరుణం పద్మ మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజే ఒక మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా షర్మిల ను అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అసలు తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. మహిళలకు న్యాయం చేయలేని చేతకాని ప్రభుత్వం గాజులు తొడుక్కోని కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వానికి గాజులు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు రమేష్, పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు వాహేద్, పట్టణ యూత్ అధ్యక్షులు ఆమెర్, మైనారిటీ కార్యదర్శి సోహైల్, మహిళా నాయకురాలు సరిత, విక్కీ , వసీమ్ తదితరులు పాల్గొన్నారు.