వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరం
బోథ్ (జనంసాక్షి) గర్బణీలు, బాలింతలు ఆరోగ్యంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ రెడ్డి సూచించారు. గురువారం బోథ్ మండలంలోని లంబాడీ తండాలో నిర్వహించిన వైద్యశిభిరం లో పాల్గొని పరీక్షలు నిర్వహించారు.వానాకాలం నేపథ్యంలో సాధారణంగా వైధ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. . ఈ సందర్బంగా ఆయన గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మంచి
ప్రోటీన్ లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో వైద్యులను సంప్రదించాలన్నారు