వ్యక్తిపై హత్యయత్నం-చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
జలాల్‌పురం(భూదాన్‌పోచంపల్లి): గ్రామానికి చెందిన గోరంటి శ్రీనివాస్‌రెడ్డి కారులో జలాల్‌పురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా శివారులో గోరంటి జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రవాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సూరెందర్‌రెడ్డి, నర్శిరెడ్డి, రామిడి నర్శిరెడ్డి లింగారెడ్డి, బొక్క బాల్‌రెడ్డి కారును అడ్డగించారు. కారు అద్దాలు తీయకపోటంతో ధ్వంసం చేశారు. శ్రీనివాస్‌రెడ్డిపై హత్యయత్నం చేయటంతో గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.