వ్యక్తి గత పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి
నర్సంపేట డిప్యూటీ కార్యాలయ హేల్త్ ఎడ్కేటర్ మర్తా
జనం సాక్షి, చెన్నరావు పేట
విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రత పాటించడం తో పాటు పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని నర్సంపేట డిప్యూటీ కార్యాలయ హేల్త్ ఎడ్ కెటర్ మర్థా సూచించారు. మంగళవారం స్థానిక ప్రాధమిక అరోగ్య కేంద్రం పరిధిలోని సూరిపల్లి ప్రభుత్య పాఠశాలలో ఆర్ బి ఎస్ కె కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థినులు నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించాలని అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె వైద్యురాలు రవళి, జులేఖ తదితరులు పాల్గొన్నారు.