వ్యవసాయరంగ బడ్జెట్‌

5

– ప్రధాని ప్రశంస

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి):  కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, రైతులు, మహిళలు, గ్రావిూణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అరుణ్‌జైట్లీకి అద్భుతమైన బడ్జెట్‌ రూపొందించారంటూ అభినందనలు తెలియజేశారు. బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగంపై ప్రధాన దృష్టి పెట్టారన్నారు. దీని ద్వారా ప్రతి భారతీయుడి సొంతింటి కల సాకారమయ్యే అవకాశం ఉందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా బడ్జెట్‌ ఉందని మోదీ స్పష్టం చేశారు. 2016-17 గాను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అద్భుతమైన బడ్జెట్‌ను రూపొందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.

బడ్జెట్‌ గ్రావిూణ భారతావనికి ప్రయోజనం కల్పించే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు ఆదాయ వర్గాలకు ఊరట లభించిందని అన్నారు. రక్షణ రంగానికి బడ్జెట్‌ చేయుతను ఇచ్చిందని, వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ దిశగా అడుగులు పడ్డాయని, యువత ఉపాధికి అవకాశాలు పెరిగాయని మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌ కంపెనీలకు మరిన్ని రాయితీలు కల్పించారని ఆయన అన్నారు. బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగంపై ప్రధానంగా దృష్టి సారించామని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి భారతీయుడి సొంత ఇంటికల సాకారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా బడ్జెట్‌ ఉందని, 2019 నాటికి ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. బడ్జెట్‌లో వ్యవసాయం, రైతులు, మహిళలు, గ్రావిూణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని ఆయన అన్నారు. గృహ నిర్మాణ రంగంపై ప్రధానంగా దృష్టి సారించామని, మోదీ స్పష్టం చేశారు.