వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి
వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని జుక్కల్ నియోజకవర్గ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేవలం ఆరు గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ అందిస్తున్నారని, నిరంతరం విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డివిజన్ ట్రాన్స్కో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్, మద్నూర్, బిచ్కుంద రైతులు హనుమాన్లు, కృష్ణ, రాజు , గంగాధర్ సతీష్ , విటల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.