వ్యవసాయ కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య
దోమ నవంబర్ 10(జనం సాక్షి).
 వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు కొడంగల్ మండలం కేంద్రంలో 2022నవంబర్ 22-23 న రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ర్యాలీ, బహిరంగ సభ, రెండవ రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ మాహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని నేడు వ్యవసాయ కార్మిక సంఘం దోమ మండల కమిటి ఆధ్వర్యంలో  దోమ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో నిరంతరము వ్యవసాయ కార్మికులు,పేదలు,రైతుల భూ సమస్యలు, అర్హులైన పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వాలని,పోడు భూమి సమస్యలు,ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, డబల్ బెడ్ రూమ్,రైతు రుణ మాఫీ వంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిరంతరం సంఘం పోరాటం నిర్వహిస్తున్నది. వ్య.కా.సంఘం మాహా సభలు మొట్ట మొదటిసారిగా కొడంగల్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది.భవిష్యత్తులో పాటు వికారాబాద్ జిల్లాలో పేదలు, కూలీల సమస్యల పైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హామీలను అమలు చేసేంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి  పెంచేవిదంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకా విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం నిర్వహిస్తామని అన్నారు.అందుకని అలాంటి కార్మికులు పక్షపాతి సంఘం మైన వ్య. కా. సంఘం మహాసభలు రెండు రోజులు పాటు జరుగుతున్నాయి. అందుకని దోమ మండలంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిదులు,అభ్యుదయవాధులు కార్మికులు,ప్రజలు అందరు సహాయ సహకారాలు అందించి, పెద్ద సంఖ్యలో పాల్గొని రెండు రోజులు జరిగే మహాసభలను జయప్రదానికి కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ  మండల కమిటీ ప్రజనీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు.కార్యక్రమంలో వ్య.కార్మిక సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శులు ఎహ్.సత్యయ్య, రఘురామ్, శేఖర్, శ్రీను పాల్గొన్నారు.