వ్యవసాయ పరివర్తనలో వర్గ సంబంధాలు

లెనిల్‌ తన డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ కాపిటలిజం ఇన్‌ రష్యాలో వివరించిన కొన్ని సూత్రాలను ఇప్పుడు చూద్దాం
1)తయారీ పరిశ్రమ పెరుగుదల
‘తయారీ పరిశ్రమలో పెట్టుబడిదారీ విధానం పెరగడమే వ్యవసా యంలో పెట్టుబడిదారీ విధానాన్ని సృష్టించి, విస్తరించడానికి ప్రధాన శక్తిగా ఉంటుంది’. అని లెనిన్‌ అన్నాడు. తయారీ పరిశ్రమలు పెరగ కుండా, వ్యవసాయం నుంచి బైటికి తోయబడిన జనాభాను కొత్త పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలలో సంలీనం చేసుకోవడం జర గదు. అందువల్ల అసంఖ్యాక ప్రజానీకం అల్పోద్యోగాలలో, బొటాబొటి జీవితాలు గడుపుతూ ఉంటారు. పారిశ్రామిక రంగంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువ గనుక రైతాంగంలో కొత్తగా వస్తున్న వర్గవిభజన వల్ల బైటికి తోయబ డుతున్న ప్రజానీకానికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పించజాలదు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలన్నిటిలోనూ ఈ  పరిణా యాన్ని చూడవచ్చు. ఇలా ఇతర ఉపాధి అవకాశాలు కొరవడడం వల్ల భూమి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అశేష ప్రజానీకం అర్ధ దారిద్య్ర స్థితిలో, చిల్లర మల్లర పనులు చేసి పొట్టపోషి ంచుకుంటూ ఉంటారు. వారు మొత్తం మీద ఉనికిలో ఉన్న వెనుక బడిన ఉత్పత్తి సంబంధాలలోనే కొనసాగుతుంటారు.
2) వినియోగం పెరుగుదల
సరుకుల ఉత్పత్తి ఉనికిలో ఉన్నంతమాత్రాన మొత్తంగా పెట్టుబ డిదారీ విధానం ప్రాబల్యంలో ఉన్నట్టు కాదు. ‘పెట్టుబడిదారీ విధా నం అంటే అత్యున్నత దశకు చేరిన సరుకుల ఉత్పత్తి అక్కడ శ్రమశక్తి కూడ సరుకు అయిపోతుంది’ అని లెనిన్‌ అన్నాడు. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో ‘వినియోగం’,’పంపిణీ’ ఎంతగా పెరిగాయో అంచనా వేసేటప్పుడు, ఉత్పత్తి సంబంధాల మీద వాటి ప్రభావం ఏమిటో చూడడం చాల ముఖ్యం. సరుకుల వినియోగం పెరిగిపో యిందని అలవోకగా చూసే ఉదాహరణలు కొంత వరకు పెట్టుబ డిదారీ సంబంధాలు పెరగయనడానికి సూచికలుకావచ్చుగాని మౌల క పరివర్గన జరిగిందని రుజువు చేయడానికి తగిన కారణం కావు. లెనిన్‌ అన్నట్టుగా ‘సామాజిక ఉత్పత్తిలోని వేరువేరు భాగాలు పునరు త్పత్తి పొందుతున్న ప్రక్రియను అర్థం చేసుకోకుండా ‘వినియోగం’ గురించి చర్చించడం కూడ సాధ్యం కాదు… రాజకీయార్థిక శాస్త్రం వ్యవహరించేది కేవలం ‘ఉత్పత్తి’తో కాదు, ఉత్పత్తిలో మనుషుల మధ్య ఏర్పడుతున్న ప్రక్రియను అర్థం చేసుకోకుండా ‘వినియోగం’ గురించి చర్చించడం కూడ సాధ్యం కాదు… రాజకీయార్థిక శాస్త్రం వ్యవహరించేది కేవలం ‘ఉత్పత్తి’తో కాదు, ఉత్పత్తిలో మనుషుల మధ్య ఏర్పడుతున్న సామాజిక స్థానంలో ఉన్నదో, తత్ఫలితంగా జాతీయ వినియోగంలో ఆ వర్గం పొందుతున్న వాటా ఏమిటో నిర్ధారణ అవుతుంది’.
‘వినియోగం’,’పంపిణీ’ ల మీద మాత్రమే ఎక్కువ శ్రద్ధపెట్టి, ఉత్పత్తి సంబంధాలమీద వాటి ప్రభావమేమిటో అంచనా వేయడాన్ని విస్మరించే ‘మార్క్సిస్టు’ రాజకీయార్థిక శాస్త్రవేత్తలు చాల ఎక్కువగా ఈ మౌలిక అవగాహనను మరచిపోతున్నారు. ఒక ఉదహరణ చెప్పాలం టే, ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు లేనందువల్ల, తరాలు గడు స్తున్న కొద్దీ ఉన్న కొద్దిపాటి మడిచెక్కు మీదనే మరింత ఎక్కువమంది ఆధారపడవలసి మవస్తున్నందువల్ల, తరం మారినకొద్దీ భూమి మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇక తమ మనుగడ కోసమైన రైతు కుటుం బాలు ఉత్పాదకత పెంచుకునే దిశలో అధిక దిగుబడి వంగడాలవైపు, మార్కెట్‌ వైపు మళ్లుతున్నిరు. ఇలా మార్కెట్‌ వైపు మళ్లినప్పటికీ వారు నివసిస్తున్నది కనీస మనుగడ స్థాయిలోనే, పాత ఉత్పత్తి సంబంధాల చట్రంలోనే. మివాళ్టి వ్యవసాయ సంక్షోభం ఈ పరిస్థితి మరింత దిగార్చింది. ఈ స్థితిని కేవలం ‘వినియోగం’,’పంపిణీ’ పెరుగు తున్నదనే లెక్కలతో అర్థం చేసుకోలేం.
3) సాధారణ సరుకు ఉత్పత్తి
ఇంతకు ముందరి అంశానికి కొనసాగింపుగా మరొకటి చెప్పాలి. చేతివృత్తుల రూపంలో, చిన్న రైతు కమతాల రూపంలో, చిన్న రైతు కమతాల రూపంలో, ఉత్పత్తి విస్తారంగా శకలీకరణ చెంది. ఉన్న స్థితిలో సాధారణ సరుకుల ఉత్పత్తి దానికదిగా తప్పనిసరిగా పెట్టుబ డిదారీ అభివృద్ధికి సూచిక కాదు. ‘చిన్నతరహా భూ ఆస్తి ఉన్నదంటే  జనాభాలో అత్యధిక సంఖ్యాకులు గ్రామాలలో ఉన్నారని అర్థం. సామాజిక శ్రమ కాకుండా, ఒంటరి శ్రమ ప్రాధాన్యత వహిస్తున్నదని అర్థం…’ అని మార్క్స్‌ అన్నాడు, ‘చిన్న మడిచెక్క భూమి మీద యాజ మాన్యం ఉన్నదంటే దాని స్వభావం వల్లనే అది సామాజిక శ్రమ ఉత్పత్తి శక్తుల అభివృద్ధినీ, సామాజిక శ్రమ రూపాలనూ, పెట్టుబడి సాంఘిక కేంద్రీకరణనూ, భారీస్థాయి పశుపోషణనూ, శాస్త్రవిజ్ణానపు ప్రగతిశీల అన్వయాన్నీ అడ్డుకుంటుంది’ అని కూడ మార్క్స అన్నాడు.
ఇతర ఉద్యోగ, ఉపాధి వనరుల కొరత వల్ల భూమి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. తరం మారి కొత్త తరం వచ్చేసరికి, తమ చిన్నచిన్న మడిచ్కెల మీద ఆధారపడేవారి సంఖ్య పెరిగిపోయి, వారి అవసరాలకు తగినట్టుగా దిగుబడి పెంచుకోవడం కోసం ఎంతో మంది రైతులు అధిక దిగుబడి వంగడాలవైపు మళ్లుతున్నిరు. ముంచుకొస్తున్న  సామ్రాజ్యవాద విధానాల ఫలితంగా, వ్యవసాయ సంరక్షోభంతో ఇవాళ అత్యధిక రైతుంగ కుటుంబాలు రుణభారంతో దివాళా ఎత్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించడంతో పాటు. ఈ రకమైన సరుకుల మారకం వల్ల ఎంత అదనపు విలువ తయారవుతున్నాదో, అది ఎంతవరకు మౌలిక అవసరాలు తీరుస్తున్నదో నిర్ధారించడం అవసరం. సరుకుల మారకం పెరుగుదల పెట్టుబడి సంచయంతో సంబంధం లేకుండా జరుగుతున్నట్టయితే అది సాధారణ సరుకుల ఉత్పత్తికే దారితీస్తుంది గాని, పెట్టుబడిదారీ వ్యవస్థకు కాదు.

4) పెట్టుబడి సంచయం

వ్యవసాయంలో తయారవుతున్న అదనపు విలువ తిరిగి వ్యవసాయంలోనే ఎంతవరకు మదుపుగా పెట్టబడుతున్నదనేమీద. వ్యవసాయ రంగంలోకి వస్తున్న మదుపులో ఎంతభాగం ప్రభుత్వం నుంచీ, ప్రైవేటు రంగం నుంచీ వస్తున్నదనే దానిమీద ఆధారపడి వ్యవసాయంలో పెట్టబడి సంచయం పరిమాణం ఉంటుంది. నిజా నికి పెట్టుబడిదారీ వృద్ధిని నిర్ణయించే కారకాలలో పెట్టుబడి సంచ యం ఒకటి. ఎందుకంటే స్థిర పెట్టుబడి(ఉత్పత్తి సాధనాల ఉత్పత్తి) అంతకంతకూ త్వరితగతిన పురోగమిస్తూ ఉండడమే పెట్టుబడిదారీ విధానపు మౌలిక నియమం. పెట్టుబడిదారీ వ్యవసాయం గనుక సాగుతున్నట్టయితే ధనికరైతాంగంవర్గం తన అరనపు విలువను (మిగులును ) నానిటికీ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం రూపంలో వ్యవసాయంలోనే తిరిగి మదుపు పెట్టాలి. తద్వారా ధనికరైతులు తమ వ్యవసాయక్షేత్రంపు ఉత్పాదకతను పెంచుకుని, దాని నుంచి తాము రాబట్టే అదనపు విలువను పెంచుకోగలుగుతారు. అంటే, మ నం వ్యవసాయ రంగంలో ఎంత మిగులు రూపొందుతున్నదో, అది ఏ పద్ధతిలో ఉపయోగంలోకి వస్తున్నదో పరిశోధించవలసి ఉం టుంది. ‘హరిత విప్లవపు’ మొదటి దశాబ్దాన్ని మినహాయిస్తే, వ్యవ సాయ రంగ సంక్షోభం వల్లా, వ్యవసాయ ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదలకూ, వ్యవసామోత్పత్తుల ధరల తరుగుదలకూ మధ్య వ్య త్యాసం వల్లా వ్యవసాయ రంగపు మిగులు అంతా పీల్చివేయ బడు తున్నది. ప్రపంచీకరణ దశలో, 1990లలో ఈ సంక్షోభం ఇంకా తీవ్రతరమై, ఈ మిగులు ఇంకా తగ్గిపోవడం మాత్రమే కాదు. వేలాది మంది రైతులను ఆత్మహత్యలవైపు నెట్టింది. అభ్యమవుతున్న గణాం కాల ప్రకారం వ్యవసాయ రంగంలో స్థూల పెట్టుబడి సమీ కరణ 19 80లలో 11 శాతం ఉన్నదల్లా 1990 లలో 7.6 శాతానికి తగ్గింది.

-కోబడ్‌ గాంధీ

వీక్షణం సౌజన్యంతో…

(తరువాయి భాగం రేపటి సంచికలో)