వ్యవసాయ బావిలో మొసలివ్యవసాయ బావిలో మొసలి భయంగా భయంగా బాటసారులు

 

కొత్తగూడ మార్చి 18 జనంసాక్షి:మొసలి అనగానే మనకు పెద్ద సరుసులలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.కానీ కొత్తగూడ మండల పరిధిలో మాత్రం పాకాల సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తరచుగా కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఏకంగా మొసళ్ళు ఎండాకాలం రావడంతో చెరువులను వదిలిపెట్టి వ్యవసాయ బావుల చుట్టూ తిరుగుతున్నాయి.ఈ మొసలి ఎన్ని రోజులుగా కనిపిస్తుందని గ్రామస్తులను అడగగా గత సంవత్సర కాలంలో చెరువులో కనిపించిందని తెలియజేయడం జరిగింది.ప్రస్తుతం బాటసారులనను భయ పెడుతున్న మొసలి మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో ముసలి ఉండేదని,చెరువులో నీరు తగ్గడంతో గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావుల చుట్టూ తిరుగుతుందని స్థానిక ప్రజలు తెలపడం జరుగుతుంది.పక్కనే ఉన్నటువంటి రోడ్డు సమీపానికి వచ్చిన ముసలి బాటసారిలను చూసి ప్రస్తుతం బంగారి నరేష్ బావిలో ముసలి దూకడం జరిగిందని తెలిపారు.దగ్గరగా చూసిన బాటసారులు మొసలి కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.గ్రామానికి చుట్టూ ఉన్న బావులలో గొడ్డు,గొర్రె నీరు తాగడానికి వెళ్తుంటాయని తక్షణమే అధికారులు స్పందించి ఈ మొసలిని తీసుకువెళ్లాల్సిన గ్రామస్తులు కోరుతున్నారు.