వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అభివృద్ధి  ప్రధాత మంత్రి జగదీష్ రెడ్డిని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తూ, ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అడితి వ్యాపారులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.