వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశం ఏర్పాటు చేసిన:చైర్మన్
ధర్మపురి ( జనం సాక్షి న్యూస్) వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్,అధ్వర్యంలో పాలకవర్గ సాధారణ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశములో జూన్ 2022 నుండి ఆగష్టు 2022 మాసములు ఆదాయ వ్యయాలు, వివిధ గ్రామాల యందు ఉచిత పశు వైద్య శిభిరముల పై చర్చ, మార్కెట్ యార్డు నందు ఈశాన్యము మూలాన గల పురాతన నీటి ట్యాంకు తొలగింపు పై చర్చ, లైసెన్స్ లు లేకుండా కొనుగోళ్లు చేసే వ్యాపారుల పై కేసుల నమోదు చేయుట పై చర్చ మరియు తదితర అంశముల పై చర్చించారు. రైతులకు మేలు చేసే విధంగా కొనుగోళ్లు ఉండాలని కొంతమంది దళారులు లైసెన్స్ లేకుండా గ్రామాల్లో కొనుగోలు చేస్తూ, రైతులను నిలువునా ముంచుతున్నారు,కమిటీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.. దీని పైన స్పందించిన చైర్మన్ ఖచ్చితంగా దళారుల పైన కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది.ఈ సమావేశములో పురపాలక సంఘ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ,జైన చైర్మన్ సౌల్ల నరేష్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్ కుమార్, మరియు పాలకవర్గ సభ్యులు మైనేని వెంకటి,జంగ శ్రీనివాసు, మామిడి శ్రీనివాస్ గైని మల్లేశం, మహమ్మద్ ఇక్రం, వీరవేని రాజ మల్లయ్య , చక్రాల శ్రీనివాస్, పాయిల శ్రీనివాస్,గాజుల సత్తయ్య ,మతి అల్పట్ల లక్ష్మి ,బొల్లం హరి ప్రసాద్ మరియు మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.