వ్యవసాయ రంగాన్ని ఆదుకోండి
నిధుల్ని పెంచండి: మంత్రి పోచారం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి నిధులను కేటాయించాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వ్యవసాయంలో ముందుకు వెళుతున్న తెలంగాణకు బడ్జెట్‌లో అత్యధికనిధులు అవసరమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెల్లామన్నారు. కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్‌తో మంత్రి పోచారం బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. తమది రైతుల ప్రభుత్వమన్న ఆయన అగ్రికల్చర్, ఫిషరీస్, పాడి పరిశ్రమలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల కంటే రాష్టాభ్రివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఉద్ఘాటించారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.హార్టికల్చర్ యూనివర్శిటి ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాధామోహన్‌సింగ్‌తో జరిగిన భేటీలో వచ్చే బడ్జెట్‌లో వర్శిటీ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరానన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ.. నిధులతో హార్టికల్చర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. స్థలం రెడీగా ఉందా వారు అడగడం జరిటగిందని, దీనికి గజ్వేల్ లోని ములుగులో నెలకొల్పడానికి స్థలం ఏర్పాటు చేసుకున్నట్లు తెలపడం జరిగిందన్నారు. అయితే కేంద్రం వెంటనే స్పందిస్తుందని తెలిపినట్లు పేర్కొన్నారు. దాంతో పాటు అగ్రికల్చర్, మత్స్య సంవర్థశాఖకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి పోచారం తెలిపారు.