వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు

పెనుబల్లి, అక్టోబర్ 21(జనం సాక్షి)
కార్పొరేట్ శక్తులకు తలొగ్గి వ్యవసాయ రంగాన్ని దివాల తీయించే విధంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో రైతు సంఘం 6వ. మండల మహాసభ రైతు సంఘం నాయకులు మామిళ్ళ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతులు పరిస్థితి అత్యంత  దయనీయంగా మారిందని, కౌలు  రైతులు ఎదుర్కొంటున్న  సమస్యలపై ప్రభుత్వం అస్సలు పట్టించుకో బోమని నిర్దాక్షిణ్యంగా తెగేసి చెబుతోందన్నారు.   రైతు బంధు పథకం ద్వారా కౌలు రైతులకు ఎటువంటి మేలు జరగకపోవడం,విత్తనాలు ఎరువులు అధిక ధరలకు విక్రయాలు  సాగిస్తు కౌలు రైతులు సైతం వ్యవసాయం నుండి దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బ్యాంకు రుణాలు అందక ప్రవేటు అప్పులపై  ఆధారపడి వ్యవసాయం చేయడం వలన కౌలు రైతులు అదోగతి పాలవు తున్నారని అన్నారు,
ప్రజలకు ప్రభుత్వం అనేక  వ్యక్తిగత, సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి  ప్రజలకుభూపంపిణీ చేయకుండా కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయి అని అన్నారు. .వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా పాలకుల ధోరణిఉందన్నారు.  కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రావుల రాజబాబు, సి ఐ టి యురాష్ట్ర కమిటీ సభ్యులు చలమల విట్టల్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు పాల్గొన్నారు.
… తెలంగాణరైతు సంఘం మండల నూతన కమిటీ ఏర్పాటు……..
పెనుబల్లి మండల తెలంగాణ రైతు సంఘం నూతన కమిటీ 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్ష కార్యదర్శులు గ నల్లమల అరుణ ప్రతాప్, చలమల నరసింహారావు, చిలక రామచంద్రుడు, ఎన్నుకో బడ్డారు.