వ్యవసాయ శాఖలో బదిలీలు
కడప, జూలై 11 : వ్యవసాయ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జోనార్దన్ ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లాలోని పది మంది వ్యవసాయ విస్తరణాధికారులు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశామన్నారు. అలాగే ఇద్దరు టైపిస్టులను, ముగ్గురు స్టోర్ క్లీపర్లను, నలుగురు జీపు డ్రైవర్లను కూడా బదిలీలు చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ బదిలీలు జరిగాయని అన్నారు.