వ్యసనాలకు బానిసై మోసాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

మల్లాపూర్:(జనంసాక్షి) జూలై19 మండలంలోని రాఘవపేట గ్రామానికి చెందిన చిట్యాల నవ తేజ 23 సంవత్సరాల యువకుడు గత కొంతకాలంగా వ్యసనాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుచున్నాడు. మల్లాపూర్ ఎస్సై జి నవీన్ కథనం ప్రకారం మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన అల్లాడి రాంగోపాల్ వద్ధ రెండు జనరేటర్లను నవతేజ అద్దెకు తీసుకున్నడు. మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో గత రామ్ గోపాల్ నవతెజ కోసమని వెతికిన దొరకకపోవడంతో మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నవీన్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసమై వెతకగా ఈరోజు ఉదయం రాఘవపేటలో పోలీసులకు నవతేజ పట్టుపడ్డాడు. నవతేజను పోలీసులు విచారించగా తన ఇంట్లో 5 జనరేటర్లు ఉన్నట్లు తెలుపగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న జనరేటర్లు మెట్‌పల్లి పట్టణానికి చెందిన జోగలక్ష్మణువి రెండు, వేంపేటకు చెందిన పెంటపర్తి రాకేషువిరెండు, అల్లాడి రాంగోపాల్ కి చెందిన ఒకటి కాగా ఇంకో జనరేటర్ మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మీనుగు నరేష్ కు విక్రయించినట్లు విచారణలో తేలినట్లు మల్లాపూర్ ఎస్సై జి నవీన్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని నవతేజను కోర్టులో హజరు పరిచినట్లు మల్లాపూర్ ఎస్సై జితెలిపారు