వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు
ఆదిలాబాద్,జూన్7(జనం సాక్షి): సీజనల్ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ ధికారి సూచించారు. వర్షాకలం ప్రాంభంకావడంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు చేపట్టామని అన్నారు. వ్యాధులు సోకుండా వ్యాక్సిన్ వేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోనిఆశ్రమ పాఠశాలలు, వివిధ హాస్టళ్లు, గురుకులాలు కలిపి పాఠశాలలో దోమల నివారణ చర్యలలో భాగంగా మందును పిచికారి చేస్తున్నామన్నారు. దీంతో మలేరియా వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.