వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన.

 

మల్దకల్ డిసెంబర్ 14 (జనంసాక్షి):– గద్వాల జిల్లా మల్డకల్ మండలo పాల్వాయి గ్రామం లో చైల్డ్ ఫండ్ ఇండియా మరియు జిల్లా లెప్రసి సంస్థ అధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ను నిర్వహించడం జరిగింది. సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సీసనల్ వ్యాధులు, హెచ్ఐవి, టిబి మరియు సుఖవ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. మరియు ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పారు.  మరియు 70 మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్వంచ్ శివరాం రెడ్డి, జిల్లా లెప్రసీ అధికారి ప్రేమ కుమార్ గారు, మాల్డకల్ మండల పి.హెచ్.సి హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, మరియు గ్రామ పెద్దలు ఆశ వర్కర్లు & సంస్థ సిబ్బంది రామకృష్ణ, అలీబాబు, రవి కుమార్, నర్సింహ పాల్గొనడం జరిగింది.