శంకరపట్నం లో రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు..

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 9
శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం మండలంలోని రాజాపూర్ గొల్లపల్లెకు కు చెందిన కుర్రె ఎర్రయ్య అనే వ్యక్తి తన మోపెయిడ్ పై కేశవపట్నం గ్రామానికి వ్యక్తిగత అవసరాల కోసం మొలంగూర్ నల్ల వెంకయ్య పల్లె మీదుగా వస్తుండగా నల్ల వెంకయ్య పల్లె క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటే క్రమంలో ఎర్రయ్యను వరంగల్ నుండి కరీంనగర్ కు వెళ్లే ఓ కారు ఢీకొట్టడంతో ఎర్రయ్యకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న కేశవపట్నం బ్లూ కోర్టు పోలీసులు హెడ్ కానిస్టేబుల్ లతీఫ్, హోంగార్డు సదయ్య ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు