శంషాబాద్‌లో వైభవంగా సీతారాముల కల్యాణం

హైదరాబాద్‌: నగర శివారులోని శంషాబాద్‌ మండలం శ్రీరామనగరం దివ్యసాకేతం వద్ద సీతారాముల కల్యాణవేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ఈ వేడుకలు జరిగాయి. నగరంతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.