శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ నెల 31వరకూ విజిటర్స్‌ పాసులను అధికారులు రద్దు చేశారు. రిపబ్లిక్‌ డే నేపథ్యంలో శంషాబాద్‌ విమాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటలిజెన్స్‌ అధికారులకు సూచనలు అనుసరించి భద్రత పెంచినట్లు ఎయిర్‌ పోర్టు అధికారులు తెలియజేశారు.